ఖమ్మంలో సుఫలా యాత్ర | చినజీయర్ స్వామి సందేశం | జనవరి 19, 2026
Jan 13, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published4 months ago
Duration2:34
Video IDGlLEOYrbDMw
Languagete
CategoryEducation
PrivacyPublic
Made for KidsNo
Video TypeYouTube Short
Performance Metrics
Views3.1K
Likes55
Comments2
Engagement Rate1.83%
Likes per 100 views1.76
Comments per 1K views0.64
Video Tags
Description
#raitunestham #ప్రకృతి_వ్యవసాయం, #సుఫలా_యాత్ర, #ప్రకృతి_జీవనం, #ప్రకృతి_వైద్యం, #ఆరోగ్యం, #రైతు_సంక్షేమం, #జీయర్_ట్రస్ట్, #చినజీయర్_స్వామి, #సిద్ధార్థ_యోగ_విద్యాలయం, #రైతు_నేస్తం, #NaturalFarming, #OrganicFarming, #HealthyLifestyle, #ChemicalFreeFarming, #SustainableAgriculture, #PublicHealth, #EnvironmentalProtection, #GreenLiving
ఆధునిక ఆహార అలవాట్లు.. గతి తప్పిన జీవనశైలి .. ప్రమాదకర అనారోగ్యాలకు ప్రధాన కారణాలు. ప్రాణాంతక రోగాలు రావడానికి దారితీసే మూలాలను వదిలేసి... కేవలం ఆసుపత్రులు, మందులతో అన్నీ బాగవుతాయనే అపోహ తీవ్ర నష్టం చేస్తోంది. వ్యవసాయంలో వాడుతోన్న రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు అటు పర్యావరణాన్ని దెబ్బతీయడంతో పాటు ఆయా పంటలను తింటున్న ప్రజల ఆరోగ్యాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ విధానం ద్వారా పెట్టుబడులు భారంగా మారి రైతులకు శ్రమకు తగిన ఆదాయం లభించడం లేదు. పర్యావరణం, ప్రజల ఆరోగ్య పరంగా ఎదురవుతోన్న ఈ విపత్కర పరిస్థితుల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు మన ముందున్న ఉత్తమ మార్గం... ప్రకృతి వ్యవసాయం మరియు ప్రకృతి జీవనం. ఈ అంశంలో ప్రజలను చైతన్యం చేయాలని సంకల్పించింది... జీయర్ సంస్థ. ఇందులో భాగంగా... త్రిదండి చినజీయర్ స్వామి ప్రోత్సాహంతో... జీయర్ సంస్థలు, సిద్ధార్థ యోగా విద్యాలయం మరియు రైతు నేస్తం ఫౌండేషన్ ఇంకా అనేక ఎన్జీఓ లు … రైతు సంక్షేమం మరియు సమాజ ఆరోగ్యం కోసం సుఫల యాత్ర నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా జనవరి 2026 జనవరి 19వ తేదీ మంగళవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని సిద్ధార్థ యోగా విద్యాలయంలో ఉదయం 9 గంటలకు సుఫలా యాత్ర చేపట్టనున్నారు. త్రిదండి చినజీయర్ స్వామితో పాటు సిద్ధార్థ యోగా విద్యాలయం ప్రకృతి వైద్యులు డాక్టర్ రామచంద్ర రావు మరియు రైతు నేస్తం వెంకటేశ్వర రావు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని... జీయర్ ట్రస్ట్ సలహాదారు ఎర్నేని రామారావు తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై.. ప్రకృతి వైద్యం, ఆరోగ్యంపై అవగాహన సదస్సు జరుగుతుందని వివరించారు. సహజ విధానంలో పంటల సాగు ద్వారా కలిగే లాభాలను వివరిస్తారని... ప్రకృతి వైద్యం, ఆరోగ్యం ప్రయోజనాలను తెలియజేస్తారని పేర్కొన్నారు. అనంతరం... రైతులు, పర్యావరణ – ప్రకృతి వైద్య ప్రేమికులతో కలిసి చినజీయర్ సుఫలా యాత్ర నిర్వహిస్తారని వెల్లడించారు. ప్రకృతి రైతుల అభ్యున్నతి... ప్రకృతి వైద్యం ప్రయోజనాలు... ప్రకృతి జీవనం ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆరోగ్య ప్రేమికులు, రైతులు, పర్యావరణ ప్రియులు భారీ సంఖ్యలో పాల్గొని.... సుఫలా యాత్రను విజయవంతం చేయాలని ఎర్నేని రామారావు పిలుపునిచ్చారు.మరిన్ని వివరాల కోసం సంప్రదించ వలసిన నంబర్లు 98480 21518, 9490559999