అగ్రి వ్యాపారులగా మారాలనుకుంటే.. ఇదే ఉత్తమ వేదిక | RNF #Raitunestham #ANGRAU #AgriEntrepreneurship

May 7, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published1 month ago
Duration15:50
Video IDMWumghUOmSw
Languagete
CategoryEducation
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views3.1K
Likes108
Comments3
Engagement Rate3.61%
Likes per 100 views3.51
Comments per 1K views0.98

Description

#raitunestham #Agriculture #NaturalFarming #OrganicFarming #FarmerEmpowerment #AgriBusiness #ValueAddition #SelfEmployment #RythunesthamFoundation #SustainableFarming #Millets #Vermicompost #DairyFarming #MushroomCultivation #Beekeeping #AgriTraining #AgriMarketing #FarmMechanization #AgriTechnology #AgriDrones #EVTractors #Guntur #ANGRAU #AgriEntrepreneurship ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతు.. శ్రమకు తగిన ఆదాయం పొందాలంటే... కర్షకులు వ్యాపారులు కావాలి. ప్రకృతి సాగు ద్వారా పంటలు పండించి... ఆ పంటలకు పంటలకు విలువ జోడించి సొంతంగా మార్కెటింగ్ చేసుకునే నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉన్న స్వయం ఉపాధి మార్గాలను అందిపుచ్చుకోవాలి. ప్రకృతి వ్యవసాయ విధానాలు... పంటలకు విలువ జోడింపు... స్వీయ మార్కెటింగ్ నైపుణ్యాలు... ఇలా రైతుని వ్యాపార వేత్తలుగా మార్చే అన్ని అంశాలను ఒకే చోట నేర్పే ఉత్తమ వేదికగా నిలుస్తోంది.... రైతునేస్తం ఫౌండేషన్... గుంటూరు జిల్లా పుల్లడిగుంట సమీపంలోని కొర్నెపాడులో ఉన్న రైతునేస్తం ఫౌండేషన్... అన్నదాతలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ఫౌండేషన్ లో దాదాపు 10 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఆ పంటల సాగుపై సందర్శకులకి సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు. ప్రకృతి, సేంద్రియ కషాయాల తయారీ, వాడకంపై శిక్షణ ఇస్తూ ప్రత్యక్ష పద్ధతిలో అన్ని అంశాలను వివరిస్తున్నారు. బహుళ అంచెల సాగు విధానాలను ప్రత్యక్షంగా చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. గో పోషణ, సంరక్షణ, అభివృద్ధి, గోవుల ద్వారా కలిగే ప్రయోజనాలను స్వయంగా తెలుసుకునేలా ఫౌండేషన్ లో గోశాలను నిర్వహిస్తున్నారు. గో వ్యర్థాలతో వివిధ రకాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ తదితర అంశాలను తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. పండించిన పంటలకు విలువ జోడించాలంటే.. యంత్ర పరికరాలు కావాలి. వాటిని ఏర్పాటు చేసుకునే విధానాలు, ఉపయోగించే పద్ధతులు తెలియాలి. ఈ విధానాలను రైతునేస్తం ఫౌండేషన్ లో సమగ్రంగా వివరిస్తున్నారు. పంటలతో వివిధ రకాల ఉత్పత్తుల తయారీ, బిస్కెట్లు, టమాటా సాస్ తయారీ, కారం, వివిధ రకాల పిండి తదితర ఉత్పత్తుల తయారీకి ఉపయోగించే యంత్రాలపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు. ఆయా యంత్రాలను సమకూర్చుకునే మార్గాలను తెలియజేస్తున్నారు. చిరుధాన్యాలతో వివిధ రకాల ఆహార పదార్థాల తయారీపై నైపుణ్యాలు సమగ్ర శిక్షణ ఇస్తూ... స్వయం ఉపాధికి బాటలు వేస్తున్నారు. ఆయా పంటలతో విలువ జోడింపు ఉత్పత్తుల తయారు చేయడమే కాకుండా... వాటిని నాణ్యంగా ప్యాకింగ్ చేసి … సొంతంగా మార్కెటింగ్ చేసుకునే పద్ధతులపై రైతులు, యువతకి అవగాహన కల్పిస్తోంది... రైతునేస్తం ఫౌండేషన్.... వ్యవసాయ అనుబంధ రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయి. సేద్యానికి అనుబంధంగా కొన్ని రకాల యూనిట్ల ఏర్పాటుతో అటు రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. ఇటు యువత స్వయం ఉపాధి మార్గాలను నిర్మించుకోవచ్చు. ఈ అంశంలో అటు రైతులు, ఇటు యువతకి అండగా నిలుస్తూ.. వారిని నిపుణులుగా తీర్చిదిద్దుతోంది... రైతునేస్తం ఫౌండేషన్. పుట్టగొడుగులు, తేనె, కట్టె గానుగ నూనెలు, వర్మీ కంపోస్టు యూనిట్లను నిర్వహిస్తూ.... వాటి ఏర్పాటు, నిర్వహణ, ఉత్పత్తుల మార్కెటింగ్ పై అవగాహన కల్పిస్తోంది. వ్యవసాయంలో అందుబాటులోకి వస్తోన్న నూతన టెక్నాలజీలపై ఎప్పటికప్పుడు రైతులని చైతన్యం చేస్తోంది. ఆధునిక యంత్రాలు, కొత్త రకం ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లను పరిచయం చేస్తోంది. వ్యవసాయ డ్రోన్లు, ఈవీ ట్రాక్టర్లు తదితర సరికొత్త ఆవిష్కరణలను రైతులకి చేరువ చేస్తోంది. ఇలా.... ఒకే ఒక్క సందర్శనతో రైతులు వ్యాపారవేత్తగా మారే విషయ పరిజ్ఞానాన్ని అందిస్తోంది... రైతునేస్తం ఫౌండేషన్. ఫౌండేషన్ సందర్శన ద్వారా కలుగుతోన్న ప్రయోజనాలను గుర్తించి... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల స్వచ్ఛంద సంస్థలు, వ్యవసాయ వేదికలు.... తమ సభ్యుల శిక్షణ కోసం రైతునేస్తం ఫౌండేషన్ ను సందర్శిస్తున్నాయి. ఈ క్రమంలో గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లామ్ ఫామ్ ఆధ్వర్యంలో విద్యార్థులు, బోధనా సిబ్బంది రైతునేస్తం ఫౌండేషన్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం బోధనా సిబ్బంది డాక్టర్ టీ సంతోష్ కుమార్, టీచింగ్ అసోసియేట్ వై ప్రభావతి, రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు పాల్గొన్నారు . కార్యక్రమంలో భాగంగా... విద్యార్థులు రైతునేస్తం ఫౌండేషన్ లో సాగవుతున్న పంటలను పరిశీలించారు. గోశాలను సందర్శించారు. సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించే కషాయాలు, ద్రావణాల తయారీ, ఉపయోగించే విధానాలను తెలుసుకున్నారు. వర్మీ కంపోస్టు, గో ఉత్పత్తుల తయారీ పై అవగాహన కల్పించారు. కట్టె గానుగ నూనెల తయారీ, వేరు శనగ నుంచి పప్పు వేరు చేసే యంత్రం, వేరు శనగ పప్పులపై పొట్టు తొలగించే యంత్రం, టమోటా సాస్ తయారీ ప్రక్రియ, బిస్కెట్ల తయారీ యంత్రం, చిరుధాన్యాల ప్రాసెసింగ్ యంత్రాలు, చిరుధాన్యాలతో వివిధ రకాల వంటకాల తయారీ పై నిపుణులచే అవగాహన కల్పించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్వయం ఉపాధి మార్గాలైన తేనెటీగల యూనిట్, పుట్టగొడుగుల యూనిట్ ల స్థాపన, నిర్వహణపై ప్రత్యక్ష పరిశీలన ద్వారా అవగాహన కల్పించారు. వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ, డ్రోన్ వినియోగం, 5 అంచెల సాగు, పంటలతో ఉత్పత్తుల తయారీ - మార్కెటింగ్ తదితర అంశాలను ప్రత్యక్షంగా వివరించారు. ఫౌండేషన్ ను సందర్శించిన విద్యార్థులకి చిరుధాన్యాలతో మధ్యాహ్న భోజనం అందించారు. క్షేత్రస్థాయి సందర్శన ద్వారా సేంద్రియ సేద్యంపై సమగ్ర అంశాలను తెసుకునేందుకు అవకాశం విద్యార్థులకి కలిగిందని విశ్వవిద్యాలయం వ్యవసాయ అగ్రి బిజినెస్ మానేజ్మెంట్ కోర్స్ టీచింగ్ అసోసియేట్ డాక్టర్ వై. ప్రభావతి వెల్లడించారు..... ఒకే వేదిక ద్వారా వ్యవసాయంలో అన్ని అంశాలను నేర్చుకునే అవకాశం రైతునేస్తం ఫౌండేషన్ ద్వారా కలిగిందని విద్యార్థులు పేర్కొన్నారు

Related Videos

More videos from Raitu Nestham