ఆకుకూరలు , కొర్ర విత్తనాలు, ఔషధ మొక్కల ఉచిత పంపిణీ @ కొర్నెపాడు, గుంటూరు | Jan 5,2026
Jan 2, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published5 months ago
Duration2:32
Video IDbLTDoGqNQSE
Languagete
CategoryEducation
PrivacyPublic
Made for KidsNo
Video TypeYouTube Short
Performance Metrics
Views12.4K
Likes334
Comments3
Engagement Rate2.73%
Likes per 100 views2.70
Comments per 1K views0.24
Video Tags
#raitunestham#rytunestham#rythunestham#ritunestham#khadervali#millets#siridhanyalu#natural farming#organic farming#raitunestham foundation#agriculture news#రైతునేస్తం#ప్రకృతి వ్యవసాయం#సేంద్రియ వ్యవసాయం#రైతునేస్తం ఫౌండేషన్ దశమ వార్షికోత్సవం#rythunestham foundation 10th anniversary#ముప్పవరపు వెంకయ్య నాయుడు#venkaiah naidu#former vice president#andhra pradesh farming
Description
#రైతునేస్తం,#RythuNestham #రైతునేస్తం ఫౌండేషన్ దశమ వార్షికోత్సవం #RythuNestham Foundation 10th Anniversary #ముప్పవరపువెంకయ్యనాయుడు,#VenkaiahNaidu,#FormerVicePresident ,#AndhraPradeshFarming,#GunturFarming,#AgriEvent,#FarmerAwareness,#MilletFarming ,#FarmerSupport,#NaturalFarming,#OrganicFarming,#PrakrutiVyavasayam,#SustainableAgriculture,#FarmerTraining,#RythuSankshema,#TeluguFarming,#TeluguRythu,#IndianAgriculture,#AndhraPradeshFarming,#GunturFarming,#AgriEvent,#FarmerAwareness,#HealthyFoodMovement
ఆరుగాలం శ్రమించి.. ఎండా వానలు, ప్రకృతి వైపరీత్యాలకు ఎదురీది.. పంటలు పండించే అన్నదాతకు కష్టానికి తగిన ఆదాయం దక్కాలి. వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే విధానాలను రైతులు అందరూ ఆచరించాలి. అధునాతన సాంకేతికతను కర్షక మిత్రులు అందిపుచ్చుకోవాలి. పర్యావరణ హిత సేద్యంతో అటు రైతులకి ఆర్థిక భరోసా... ఇటు ప్రజలకు మెరుగైన ఆహారం తద్వారా ఆరోగ్యం అందాలి. ఈ లక్ష్యాల సాధన కోసమే ఆవిర్భవించింది మీ రైతునేస్తం ఫౌండేషన్. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులో స్థాపించిన ఫౌండేషన్ ద్వారా ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ... ఇప్పటికే 500 కిపైగా సదస్సులు ఏర్పాటు చేసి లక్షలాది మంది రైతులని ప్రకృతి వ్యవసాయంలో సుశిక్షితులను చేసింది. ఈ పదేళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లని అధిగమించిన రైతునేస్తం ఫౌండేషన్... రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తోంది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులో వున్న రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణలో … 2026 జనవరి 5న సోమవారం... రైతునేస్తం ఫౌండేషన్ దశమ వార్షికోత్సవం ఘనంగా జరగనుంది. ఉదయం 8 : 30 నుంచి 10 : 30 వరకు జరిగే ఈ వేడుకకి … గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రైతునేస్తం ఫౌండేషన్ లో నిర్వహిస్తోన్న కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించడంతో పాటు... నిర్వహిస్తోన్న వ్యవసాయ అనుబంధ రంగాల యూనిట్లు... గోశాల... యంత్ర పరికరాలు... ప్రకృతి, సేంద్రియ పంటలను వెంకయ్య నాయుడు గారు సందర్శిస్తారు.
వేడుకల్లో భాగంగా.. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. యంత్ర పరికరాలు, ఆహార పంటలు, ఆహార ఉత్పత్తులు, సేంద్రియ కషాయాలు, ద్రావణాలకు సంబంధించిన స్టాల్స్ కొలవుదీరుతాయి. కార్యక్రమానికి హాజరైన వారికి ఉచితంగా ఆకుకూరలు విత్తనాలు,కొర్ర విత్తనాలు, ఔషధ మొక్కలను పంపిణీ చేస్తారు. కార్యక్రమంలో భాగంగా గో తులాభారం ఉంటుంది…
ఆవు బరువుతో సమానంగా తూగడానికి ఆవు తినే పదార్థాలైన బెల్లం నువ్వులు కూరగాయలు పండ్లు నువ్వులు పెసలు మినుములు దాణా పెడతారు…అత్యంత వైభవంగా జరిగే రైతునేస్తం ఫౌండేషన్ దశమ వార్షికోత్సవానికి అందరూ ఆహ్వానితులే. కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం 97053 83666 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.