రైతుల లాభాలు పెంచే 3 రోజుల క్షేత్రస్థాయి శిక్షణ | Raitunestham | March 29 - 31
Mar 21, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published2 months ago
Duration4:16
Video IDqDtvgIVABb4
Languagete
CategoryEducation
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views7.3K
Likes185
Comments0
Engagement Rate2.54%
Likes per 100 views2.54
Comments per 1K views0.00
Video Tags
#raitunestham#rytunestham#rythunestham#ritunestham#khadervali#millets#organic farming#raitunestham foundation#రైతునేస్తం#ప్రకృతి వ్యవసాయం#సేంద్రియ వ్యవసాయం#rythunestham foundation#integrated farming#multicrop farming#multilayer farming#5 layer farming#organic farmer training#natural farmer training#raiutnestham farmer training#nabard farmer training
Description
#raitunestham #naturalfarming #nabard #raitunestham #naturalfarming #nabard #farmertraining
రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారం తో .... 2026 మర్చి 29,30, మరియు 31 తేదీల్లో... 3 రోజుల పాటు జరగనున్న రైతు శిక్షణ కార్యక్రమానికి హాజరుకండి. గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణ కేంద్రంలో ఈ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. వ్యవసాయ రంగ నిపుణులు, సాగులో ఉత్తమ ఫలితాలు సాధిస్తోన్న రైతులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని... రైతులకి అన్ని అంశాలపై సమగ్ర శిక్షణ ఇస్తారు.
ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానం..... దేశీయ ఆవుల పెంపకం, వాటి రకాలు... సేద్యంలో ఉపయోగాలను శిక్షణ కార్యక్రమాల్లో తెలియజేస్తారు. వ్యవసాయ నేలలు - మట్టి పరీక్ష, భూసార పెంపు... విత్తనశుద్ధి, అంతర పంటలు సాగు విధానాలను వివరిస్తారు. 5 అంచెల వ్యవసాయ పద్ధతిపై సమగ్ర అవగాహన కల్పిస్తారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలోని 5 లేయర్ మోడల్ ఫార్మింగ్ యూనిట్ ని ప్రత్యక్షంగా చూపించి... తక్కువ భూమిలో వీలైనన్ని ఎక్కువ పంటల సాగు తీరుని తెలియజేస్తారు. ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే వివిధ రకాల కషాయాలు, మిశ్రమాల తయారు చేసే విధానాలని ప్రత్యక్షంగా చూపిస్తారు.
సేంద్రియ పద్ధతిలో వరి, అపరాలు, జామ, బొప్పాయి సాగు.. అంతర పంటలు.. మిశ్రమ సాగుపై అవగాహన కల్పిస్తారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, గొర్రెలు - మేకలు - నాటుకోళ్ల పెంపకం... గోశాల ఏర్పాటు - నిర్వహణపై పూర్తి వివరాలు తెలియజేస్తారు. గో ఉత్పత్తుల తయారీపై సమగ్ర అంశాలు వివరిస్తారు. కూరగాయలు, పండ్ల నిల్వ చేసుకోవడం సహా... పంటలను ప్రాసెస్ చేసి.. వాటికి విలువ జోడించే మెళకువలు తెలియజేస్తారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న మోడల్ యూనిట్లను చూపించి... పంటలు, ఉత్పత్తుల ప్రాసెసింగ్ పై సమగ్ర అవగాహన కల్పిస్తారు. టమాటాలతో సాస్ తయారీ.. కారం - మసాలాల తయారీ... వివిధ ధాన్యాలతో పిండి తయారు చేసే విధానాలను ప్రత్యక్షంగా చూసి నేర్చుకోవచ్చు. చిరుధాన్యాల ప్రాసెసింగ్ మరియు చిరుధాన్యాలతో బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాల తయారీ గురించి తెలుసుకోవచ్చు.
రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాగు చేస్తున్న సేంద్రియ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించవచ్చు. వ్యవసాయంలో ఉపయోగించే యంత్ర పరికరాలు, ఉపయోగాలను సేంద్రియ వ్యవసాయ నిపుణులు వివరిస్తారు. డ్రోన్ తో పిచికారీ పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, స్వయం ఉపాధి మార్గాలపై సమగ్ర వివరాలు తెలియజేస్తారు. ఫౌండేషన్ లో ఉన్న కట్టె గానుగ నూనెల తయారీ... పుట్టగొడుగులు పెంపకం - తేనెటీగల పెంపకం - తేనె ఉత్పత్తి.. వర్మీ కంపోస్ట్, మినీ రైస్ మిల్లు... 5 అంచెల వ్యవసాయ యూనిట్లను సందర్శించి.. నిర్వహణ తీరుని పరిశీలించవచ్చు. ఆయా యూనిట్ల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
గమనిక: ఈ కార్యక్రమం కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రాంత రైతులకు మాత్రమే .
శిక్షణకు హాజరయ్యే రైతులకి.. 3 రోజులు రైతునేస్తం ఫౌండేషన్ లోనే వసతి మరియు భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ముందుగా పేర్లు రిజిస్టర్ చేసుకున్న 30 మంది రైతులకే ఈ అవకాశం. మరిన్ని వివరాలు మరియు పేర్ల నమోదు కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ - 9705 383 666, 9553825532